Wednesday, 8 July 2015

Vemana poems

source: wikipedia

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ

కనక మృగము భువిని కలదు లేదనకను
తరుణి వీడి చనియె దాశరధుడు
బుద్ధిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ, వినుర వేమ

గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆత్మశుద్ధి లేని అచారమది ఏల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజలేలర
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆల్పుడెపుడు పల్కు ఆడంబురము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ

అనువు గాని చోట అధికులమనరాదు
కొంచమైన నదియు కొదవ గాదు
కొండ అద్దమందు కొంచమై ఉండదా
విశ్వధాభిరామ, వినుర వేమ

ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటు తనము
పేదవేళ జూడు పెండ్లము గుణము
విశ్వధాభిరామ, వినుర వేమ
Chippalonabadda chinuku mutyambayye....................చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
nitabadda chinuku nita galise....................................నీటబడ్డ చినుకు నీట గలిసె
Brapti galugu chota phalamela tappura......................బ్రాప్తిగలుగు చోట ఫలమేల తప్పురా
Viswadhaabhiraama, Vinura Vema........................... విశ్వధాభిరామ, వినుర వేమ
The rain drop that fell in the shell became a pearl,
The one that fell in water merged with water,
Where there's devotion, there's bound to be fruit,
Beloved of the Bounteous, Vema, listen!
Veshabhashalerigi Kashayavastramul...................వేషభాషలెరిగి ఖాషాయవస్త్రముల్
gattagane mukti galugabodhu...............................గట్టగానె ముక్తి గలుగబోదు
talalu bodulina talapulu bodula.............................తలలు బోడులైన తలపులు బోడులా
Viswadhaabhiraama, Vinrua Vema.......................విశ్వధాభిరామ, వినుర వేమ
Changing your appearance, language and wearing saffron (renunciate) clothes
Do not lead to mukti (liberation),
Shaving of head (of a renunciate, widow etc) does not shave (unwanted) thoughts
Beloved of the Bounteous, Vema, listen!
Cheppulona rayi chevilona joriga...................చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
kantilona nalusu kali mullu.............................కంటిలొన నలుసు కాలి ముల్లు
intilona poru intinta gadaya............................ఇంటిలోన పోరు ఇంతింత గాదయ
Viswadhaabhiraama, Vinura Vema................ విశ్వధాభిరామ, వినుర వేమ
A stone in shoe, a fly near ear
Pollen in eye, a thorn in foot
A quarrel in the house, are unbearable(painful)
Beloved of the Bounteous, Vema, listen!
Tappulennuvaru Tandopatandambu...................తప్పులెన్నువారు తండోపతండంబు
Lurvi janulakella nundu tappu............................లుర్వి జనులకెల్ల నుండు తప్పు
Tappu lennuvaru tamatappu lerugaru................తప్పు లెన్నువారు తమతప్పు లెరుగరు
Viswadhaabhiraama, Vinura Vema................... విశ్వధాభిరామ, వినుర వేమ
There are many that find faults (with others)
Every one in the world has faults
The people who count faults do not know their own faults
Beloved of the Bounteous, Vema, listen!
Inumu virigeneni irumaaru mummaaru...................ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
kaachi yatakavachu kramamu gaanu......................కాచి యతకవచ్చు క్రమము గాను
manasu virigeneni mari chercharaadaya.................మనసు విరిగెనేని మరి చేర్చరాదయ
Viswadaabhiraama, Vinura Vema.......................... విశ్వధాభిరామ, వినుర వేమ
Iron, if broken, can be joined together, twice or thrice
but heart once broken can never be put together again
Medi pandu chooda melimaiyundu...................మేడి పండు చూడ మేలిమైయుండు
Potta vippi chooda purugulundu......................పొట్ట విప్పి చూడ పురుగులుండు
Pirikivani madini binkamilagura..........................పిరికి వాని మదిని బింకమీలాగురా
Viswadhaabhirama vinura Vema..................... విశ్వధాభిరామ, వినుర వేమ
Medi(fig -Common Ficus carica)), a fruit, looks gorgeous externally,
But when we rip it, we find worms within.
In a similar manner, a coward appears brave outside, but in reality he is not.
Beloved of the Bounteous, Vema, listen!
Eluka tholu thechi yedadi uthikina ..................ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
Nalupu nalupey gani thelupu kadhu....................నలుపు నలుపే గాని తెలుపు కాదు
Koyya bomma thechi kottina palukuna...............కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
Viswadhaabhirama vinura Vema....................... విశ్వధాభిరామ, వినుర వేమ
Even if you take a mouse's hide and wash it for any number of days
Its black color will remain a black and never becomes white
Similarly, even if you beat a wooden doll it will never speak (it is impossible to change the original human nature)
Beloved of the Bounteous, Vema, listen!

No comments:

Post a Comment